Ind Vs Aus : Rohit Sharma Likely To Be Rested For Part Of ODI Series Vs Australia | Oneindia Telugu

2019-02-12 769

India vs Australia 2019: Plenty of changes are expected to be made in the Indian team, with KL Rahul and Ajinkya Rahane's return in limited overs team expected to be the highlight.
#IndVsAus
#RohitSharma
#KLRahul
#AjinkyaRahane
#bhuvaneswarkumar
#mohammedshami
#cricket
#teamindia


ఆస్ట్రేలియాతో భారత్‌ వేదికగా జరగనున్న సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతినిచ్చే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 24 నుంచి భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుతో మార్చి 13 వరకూ రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. అనంతరం రెండు వారాల వ్యవధిలోనే ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. సీనియర్ క్రికెటర్లకి రొటేషన్ పద్ధతిలో తగినంత విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ఇటీవల న్యూజిలాండ్ పర్యటన నుంచి విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. తాజాగా రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకి విశ్రాంతినివ్వాలని చర్చిస్తున్నట్లు సమాచారం.